Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గతంలో హిట్ ఇచ్చిన దర్శకుడికి మళ్లీ ఛాన్స్ ఇచ్చిన యంగ్ హీరో

  • 'గుండెజారి గల్లంతయ్యిందే' సూపర్ హిట్ 
  • విజయ్ కుమార్ కొండా వినిపించిన మరో కథ
  •  'భీష్మ' తరువాత పట్టాలెక్కనున్న ప్రాజెక్టు  
నితిన్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'గుండె జారి గల్లంతయ్యిందే' ముందు వరుసలో కనిపిస్తుంది. ఈ ప్రేమకథా చిత్రం నితిన్ ను యూత్ కి మరింత చేరువ చేసింది. దర్శకుడిగా ఈ సినిమా విజయ్ కుమార్ కొండాకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే దర్శకుడితో కలిసి మరో సినిమా చేయడానికి నితిన్ రెడీ అవుతున్నాడనే వార్త బలంగా వినిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో నితిన్ కి హిట్ పడలేదు. దాంతో ఆయన బాగా అప్సెట్ అయ్యాడు. ఈ క్రమంలోనే దర్శకుడు విజయ్ కుమార్ కొండా .. నితిన్ ని కలిసి ఒక కథ వినిపించగా, ఆయన ఓకే చెప్పేశాడని అంటున్నారు. కథాకథనాల్లోని కొత్తదనమే అందుకు కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి 'భీష్మ' సినిమా కోసం నితిన్ సెట్స్ పైకి వెళ్లే పనిలో వున్నాడు. ఆ తరువాత ఆయన సినిమా విజయ్ కుమార్ కొండాతోనే.
nithin
vijay kumar konda

More Telugu News